అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Stock Markets in Red | అమెరికా (America)లో అనిశ్చితి, జియో పొలిటికల్ టెన్షన్స్‌తో గత సెషన్లో వాల్‌స్ట్రీట్ నష్టాలతో ముగిసింది. దీని ప్రభావంతో ఆసియా మార్కెట్లు సైతం నెగెటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. బడ్జెట్ ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) సైతం నష్టాల బాటలో సాగుతోంది.
శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 619 పాయింట్ల భారీ గ్యాప్ డౌన్లో ప్రారంభమై మరో 6 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి కోలుకుని 341 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ 171 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 29 పాయింట్లు పడిపోయింది. అక్కడినుంచి 105 పాయింట్లు పెరిగింది. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 359 పాయింట్ల నష్టంతో 82,206 వద్ద, నిఫ్టీ (Nifty) 111 పాయింట్ల నష్టంతో 25,307 వద్ద ఉన్నాయి.టెలికాం, కన్జూమర్ డ్యూరెబుల్, FMCG, పీఎస్‌యూ బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, ఫార్మా రంగాల షేర్లు రాణిస్తుండగా.. మెటల్, ఎనర్జీ, యుటిలిటీ, పవర్, ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
Top Gainers : BSE సెన్సెక్స్‌లో 11 కంపెనీలు లాభాలతో ఉండగా.. 19 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. ఎస్బీఐ 1.41 శాతం, బీఈఎల్ 1.07 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.02 శాతం, ఐటీసీ 0.82 శాతం, ఆసియన్ పెయింట్ 0.75 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : టాటా స్టీల్ 5.41 శాతం, ఇన్ఫోసిస్ 1.82 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.69 శాతం, పవర్‌గ్రిడ్ 1.55 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.52 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.