అక్షరటుడే, ఇందూరు: Caste census | దేశవ్యాప్తంగా కులగణన చేయాలన్న కేంద్రప్రభుత్వ central government నిర్ణయం చారిత్రాత్మకమని బీజేపీ ఓబీసీ మోర్చా BJP OBC Morcha రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామియాదవ్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ Prime Minister Narendra Modi చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. కులగణన caste census నిర్ణయం ఘనత తమదేనని కాంగ్రెస్ నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అంతేగాక, కులగణనకు తెలంగాణను మోడల్‌గా తీసుకోవాలని చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy, రాష్ట్రంలో చేసిన సర్వేపై ఆ పార్టీ నాయకుల్లోనే అసంతృప్తి ఉందన్నారు. పేదరికం నిర్మూలన కోసమే బీజేపీ ప్రభుత్వం కులగణనకు నిర్ణయించిందన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు విజయ్, తదితరులు పాల్గొన్నారు.