అక్షరటుడే, కోటగిరి : Caste census | కులగణన సమయంలో దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసిన కంప్యూటర్ ఆపరేటర్లకు (computer operators) డబ్బులు చెల్లించాలని బీఆర్ఎస్ మండల యువజన విభాగం నాయకులు గంగాప్రసాద్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కోటగిరి మండల (Kotagiri Mandal) కేంద్రానికి చెందిన నిరుద్యోగ యువకులు గతంలో కులగణన సమయంలో దరఖాస్తులు కంప్యూటర్లలో ఎంట్రీ చేశారన్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.30 చొప్పున అందజేస్తామని అప్పట్లో అధికారులు పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి రుసుము చెల్లించలేదని ఆయన చెప్పారు.
Caste census | ఏడాది కావస్తున్నా..
కులగణన కార్యక్రమం (caste census program) పూర్తయి దాదాపు ఏడాది కావస్తున్నా ఇప్పటికీ కంప్యూటర్ ఆపరేటర్లకు డబ్బులు చెల్లింకపోవడం ఎంతవరకు సబబని గంగాప్రసాద్ గౌడ్ ప్రశ్నించారు. తక్షణమే నిరుద్యోగులకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు రూ. 2,500 చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నిరుద్యోగులు నవీన్ కుమార్, కప్ప సంతోష్, తెల్ల చిన్న అరవింద్, సమీర్, రుద్రాంగి సందీప్, యోగేష్, మహేష్, సంతోష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.