- Advertisement -
HomeUncategorizedcentral cabinet | కేంద్రం పలు కీలక నిర్ణయాలు.. పలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆమోదం

central cabinet | కేంద్రం పలు కీలక నిర్ణయాలు.. పలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆమోదం

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: central cabinet : దేశంలో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. మేఘాలయ, అసోం జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. రూ.22,846 కోట్ల తో షిల్లాంగ్‌ నుంచి సిల్చార్‌ వరకు హైస్పీడ్‌ కారిడార్‌ నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు చెప్పారు. క్వింటా చెరకుకు అదనంగా రూ.15 చెల్లించాలని నిర్ణయించామన్నారు. క్వింటా చెరకుకు రూ.355 మద్దతు ధర చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించిందని అశ్వినీ వైష్ణవ్‌ వివరించారు.

central cabinet : దేశవ్యాప్తంగా కుల గణన..

భారత్​లో కులగణనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జన గణనలో కుల గణన అంశాన్ని కూడా చేర్చాలని కేంద్ర కేబినేట్‌ నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ Prime Minister Narendra Modi అధ్యక్షతన  జరిగిన మంత్రివర్గం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ Union Information and Broadcasting Minister Ashwini Vaishnav ప్రకటించారు.

- Advertisement -

central cabinet : పరోక్షంగా తెలంగాణ కులగణన అంశంపై విమర్శలు..

కులగణన విషయంలో కాంగ్రెస్‌ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కులగణనను ఆ పార్టీ రాజకీయంగా వాడుకున్నట్లు కేంద్ర మంత్రి విమర్శలు చేశారు. “కులగణను గతంలోని కాంగ్రెస్​ ప్రభుత్వాలు వ్యతిరేకిస్తూ వచ్చాయి. 2010లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో కులగణనను కేబినెట్ పరిశీలిస్తుందని ప్రకటించారు. దీనిపై కేబినెట్​ సబ్ కమిటీని కూడా నియమించారు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఇందుకు మద్దుతు తెలిపాయి. కానీ.. కాంగ్రెస్​ పార్టీ, ఇండి కూటమి కులగణను కేవలం రాజకీయాల లబ్ధి కోసమే వాడుకుంటాయి. కొన్ని రాష్ట్రాలు ఈ సర్వేలను బాగా చేయగా, మరికొన్ని రాష్ట్రాలు పారదర్శకత లేకుండా కేవలం రాజకీయ కోణంలోనే చేపట్టాయి. ఈ సర్వే వల్ల సమాజంలో చాలా అనుమానాలు తలెత్తాయి.”. అని పరోక్షంగా తెలంగాణలోని కాంగ్రెస్​ సర్కారు చేపట్టిన కుల గణనపై విమర్శించారు.

కులగణన అంశం కేంద్రం పరిధిలోకి వచ్చినప్పటికీ, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సర్వేల పేరుతో నిర్వహించాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్​ విమర్శించారు. కాగా, ఏప్రిల్‌ 2020లోనే జనాభా లెక్కలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడిందని గుర్తుచేశారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News