అక్షరటుడే, వెబ్‌డెస్క్: Cashew Apple మనం సాధారణంగా మామిడి పండ్ల సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటాం. కానీ, అదే సమయంలో లభించే మరో అద్భుతమైన పండు ‘జీడిమామిడి’. చాలామంది దీనిని కేవలం జీడిపప్పు కోసమే సాగు చేస్తారని, ఆ పండు వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని భావిస్తుంటారు. మరికొందరైతే దీని వాసన పడక పక్కన పారేస్తుంటారు. కానీ, నిజానికి మనం ఎంతో ఇష్టంగా తినే సాధారణ మామిడి పండులో ఎలాంటి పోషకాలు ఉంటాయో, అంతకు మించి ప్రయోజనాలు ఈ జీడిమామిడి పండులో (Cashew Apple) దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Cashew Apple | గుండెకు రక్షణ కవచం:
నేటి కాలంలో గుండె సంబంధిత సమస్యలు చిన్న వయసులోనే పెరిగిపోతున్నాయి. జీడిమామిడిలో ఉండే పోషకాలు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా చూస్తుంది. అలాగే, రక్తంలోని చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రిస్తుంది. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది మేలు చేస్తుంది.
Cashew Apple | రోగనిరోధక శక్తి పెంపు:
ఈ పండులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిని గణనీయంగా పెంచుతాయి. సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఉండాలంటే మామిడి కాయలతో పాటు జీడిమామిడిని కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇది శరీరంలోని కణాలను దెబ్బతినకుండా కాపాడి, మనల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది.
జుట్టు, చర్మ సంరక్షణ: జుట్టు రాలడం లేదా చుండ్రు వంటి సమస్యలతో బాధపడేవారికి జీడిమామిడి ఒక సహజ సిద్ధమైన ఔషధం. జీడి పొడిని జుట్టుకు పట్టించడం వల్ల అది ఒక నేచురల్ కండిషనర్‌లా పనిచేస్తుంది. ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, జుట్టు మెరిసేలా చేస్తుంది. అలాగే చర్మ సమస్యలతో ఇబ్బంది పడేవారికి కూడా ఇది అద్భుతమైన మెడిసిన్‌లా పనిచేస్తుంది. చర్మంపై వచ్చే మచ్చలు, ఇన్ఫెక్షన్లను తగ్గించి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.