అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: District Judge | కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఛైర్మన్ భరత లక్ష్మి (judge Bharatha Lakshmi) సూచించారు.
నిజామాబాద్ జిల్లా కోర్టులోని తన చాంబర్లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 14న లోక్అదాలత్ (Lok Adalat) నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివిధ స్థాయిల్లో ఉన్న కేసులను న్యాయ సేవాధికార సంస్థ ద్వారా రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని ఆమె కోరారు. జిల్లా వ్యాప్తంగా 1,680 కేసులు రాజీ కోసం ఎంపిక చేశామని వివరించారు. అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.