అక్షరటుడే, బాన్సువాడ:Kamareddy SP | పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(SP Rajesh Chandra) ఆదేశించారు. గురువారం నస్రుల్లాబాద్ (Nasrullabad) పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ రికార్డు(Pending record)లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదుల పట్ల వెంటనే స్పందించాలని సూచించారు. అలాగే కేసులను త్వరితగతిన పరిశీలించి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై లావణ్య, సిబ్బంది పాల్గొన్నారు.