అక్షరటుడే, వెబ్‌డెస్క్: Case on Jogi Ramesh | ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు జోగి రమేశ్‌పై కేసులు నమోదు అవుతున్నాయి. మంత్రి లోకేశ్ (Minister Lokesh)పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇబ్రహీంపట్నం, తిరువూరు, చిత్తూరు జిల్లాలో టీడీపీ నాయకులు కేసు పెట్టారు.
నకిలీ మద్యం (Fake Liquor) తయారీ కేసులో కండీషన్ బెయిల్‌పై ఉన్న జోగి రమేష్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నాయకులు ఆదివారం ఆయన ఇంటిపై దాడి చేశారు. కృష్ణా జిల్లా (Krishna District) ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంపై రాళ్లు, పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. బెయిల్‌పై ఉన్న జోగి రమేశ్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నట్లు సమాచారం. తాజా ఘటనలతో బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేసేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది. కోర్టు బెయిల్ రద్దు చేస్తే ఆ కేసులోనే ఆయనను అదుపులోకి తీసుకోనున్నారు. లేదంటే తాజా కేసులో అరెస్ట్ చేస్తారని సమాచారం.
Case on Jogi Ramesh | టీడీపీ నాయకులపై కేసులు
జోగి రమేశ్ నివాసంపై దాడి కేసులో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. టీడీపీ, వైసీపీ నేతలపై కూడా కేసులు పెట్టారు. ఆయన ఇంటిపై దాడి చేసిన టీడీపీ కార్యకర్తలు కాకి నాగరాజు, గణపతి, మేసిపాము బాబూరావుల కేసు ఫైల్ చేశారు. టీడీపీ దాడిపై ఆయన పార్టీ నాయకులతో మంతనాలు జరిపారు. మధ్యాహ్నం 2 గంటలకు జోగి రమేశ్ మీడియాతో మాట్లాడనున్నట్లు సమాచారం. కాగా పలువురు వైసీపీ నేతలు ఆయనను పరామర్శించారు.
Case on Jogi Ramesh | అంబటి ఇంటి వద్ద బందోబస్తు
మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీ హైకోర్టు (AP High Court) ఆదేశాలతో అంబటి ఇళ్లు, ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అంబటి ఇంటిపై శనివారం టీడీపీ నాయకులు దాడి చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని దాడికి పాల్పడ్డారు. అనంతరం పోలీసులు అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆదివారం అంబటి భార్య హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. తమ కుటుంబానికి భద్రతా కల్పించాలని కోరారు. ఈ మేరకు కోర్టు ఆదేశాల మేరకు కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు.