అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Youtuber Anvesh | యూట్యూబర్ అన్వేష్‌పై తెలంగాణ వ్యాప్తంగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలను హిందు సంఘాల నాయకులు ఖండిస్తున్నారు.
నటుడు శివాజీ (Actor Shivaji) ఇటీవల దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహిళల వస్త్రధారణ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై యూట్యూబర్ అన్వేష్ స్పందిస్తూ హిందూ దేవతలు సీత, ద్రౌపదిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపై వీహెచ్‌పీ (VHP), బజరంగ్దళ్(Bajrang Dal) లో పాటు హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిపై కేసులు నమోదు పెడుతున్నారు. అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Youtuber Anvesh | కరాటే కళ్యాణి ఫిర్యాదు మేరకు..
సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి (Karate Kalyani) అన్వేష్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ (Panjagutta Police Station)లో ఫిర్యాదు చేశారు. దేవతలను దూషించినందుకు కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని కోరారు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. త్వరలో అన్వేష్‌కు నోటీసులు జారీ చేయనున్నారు. అన్వేష్ వివాదాస్పద వ్యాఖ్యలతో తెలంగాణ వ్యాప్తంగా ఫిర్యాదులు నమోదు అవుతున్నాయి. అతడిని ఇండియాకు రప్పించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఖమ్మం (Khammam)లో సైతం అన్వేష్‌పై కేసు నమోదు అయింది. దానవాయిగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
Youtuber Anvesh | అన్‌సబ్‌స్క్రైబ్ చేయండి
యూట్యూబర్ అన్వేష్ వివిధ దేశాలు తిరుగుతూ వీడియోలు తీస్తాడు. ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఫేమస్ అయ్యాడు. అతడికి భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. అయితే కరాటే కల్యాణి మాట్లాడుతూ.. అన్వేష్ యూట్యూబ్ ఛానెల్‌ను అన్ సబ్ స్క్రైబ్ చేయాలని కోరారు. అతడు హిందూ, ముస్లిం గొడవలను రెచ్చగొడుతున్నాడని ఆరోపించారు. ఇంత నీచంగా మాట్లాడుతున్న అన్వేష్‌కు 2.5 మిలియన్ సబ్ స్క్రైబర్స్ ఇచ్చింది మనమే అన్నారు. కాగా అన్వేష్ వ్యాఖ్యల అనంతరం భారీగా సబ్స్క్రైబర్లు తగ్గారు. చాలా మంది ఛానెల్ అన్ సబ్‌స్క్రైబ్ చేసుకుంటున్నారు. దీంతో అన్వేష్ క్షమాపణలు చెప్పాడు.