అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | నగరంలో చైనా మాంజా (Chinese manja) విక్రయిస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మూడవ టౌన్ పోలీసులు వివరాలు వెల్లడించారు.
Nizamabad City | గౌతంనగర్, కెనాల్‌కట్ట ప్రాంతంలో..
నగరంలోని మూడో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతంనగర్, కెనాల్‌కట్ట ప్రాంతాల్లో చైనా మాంజా విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు జరిపారు. ఈ క్రమంలో గౌతంనగర్‌కు చెందిన ప్రమోద్, మహమ్మద్ యూనుస్, కెనాల్ కట్టకు చెందిన సాయితేజల వద్ద నిషేధిత చైనామాంజా లభ్యమైంది. దీంతో వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. ఈ సందర్భంగా మూడో టౌన్ ఎస్సై హరిబాబు (SI Haribabu) మాట్లాడుతూ.. చైనా మాంజా కారణంగా మనుషులతో పాటు పక్షులకు సైతం ప్రమాదం పొంచి ఉందన్నారు. చైనా మాంజా విక్రయించినా.. కొనుగోలు చేసినా శిక్షార్హులేనన్నారు.