ePaper
More
    Homeక్రైంRaging in Medical College | ర్యాగింగ్​కు పాల్పడిన మెడికోలపై కేసులు

    Raging in Medical College | ర్యాగింగ్​కు పాల్పడిన మెడికోలపై కేసులు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Raging in Medical College | ర్యాగింగ్​కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్​ కమిషనర్​ సాయి చైతన్య (CP Sai Chaitanya) హెచ్చరించారు. నగరంలోని వీక్లీ మార్కెట్ లో నివాసముంటున్న నిజామాబాద్ మెడికల్ కాలేజీ (Medical College) విద్యార్థి రాహుల్ రెడ్డిని ర్యాగింగ్ చేసిన పలువురిపై పోలీసులు ఆదివారం వన్​టౌన్​ ఠాణాలో కేసు నమోదు చేశారు.

    పటాన్​చెరుకు చెందిన రాహుల్​ రెడ్డి ప్రస్తుతం కాలేజీలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్నల్​ డ్యూటీలో భాగంగా ప్రభుత్వ జనరల్​ హాస్పిటల్​లో విధులు నిర్వర్తించాడు. అయితే రాహుల్​ విధులకు గైర్హాజరైనట్లు సీనియర్​ అయిన సాయిరాం పవన్​ రిజిస్టర్​లో నమోదు చేశాడు. దీనిపై ప్రశ్నించడంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేగాకుండా శనివారం సాయంత్రం మాట్లాడుదామని పిలిపించి దాడి చేశాడు. సుమారు 15 మంది రాహుల్​ను ర్యాగింగ్​ చేయడంతో పాటు బెదిరించారు. సాయిరాం, పవన్, శ్రావణ్, సాత్విక్ హృదయ పాల్, అభినవ్ పెద్ది, ఆదిత్య దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు బాధిత విద్యార్థి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

    Raging in Medical College | కఠిన చర్యలు

    పాఠశాలలు, కాలేజీల్లో ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సాయి చైతన్య హెచ్చరించారు. విద్యాసంస్థల పరిధిలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా ర్యాగింగ్ చేస్తున్నట్లు తెలిసినా, గమనించినా వెంటనే డయల్​ 100, పోలీస్​ కంట్రోల్ రూమ్ నంబర్ 8712659700 ఫోన్​ చేసి సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని సీపీ తెలిపారు.

    Latest articles

    Tollywood film industry | సినిమా పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణ సహకారం : సీఎం రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: Tollywood film industry : సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని...

    TPCC Chief Mahesh | తెలంగాణలోనూ దొంగ ఓట్లు ఉన్నాయి.. టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: TPCC Chief Mahesh : టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ దొంగ...

    Gandhari | దాబాలో యథేచ్ఛగా సిట్టింగ్​లు.. యజమానిపై కేసు నమోదు

    అక్షరటుడే, గాంధారి: Gandhari | పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ దాబాల్లో యథేచ్ఛగా సిట్టింగులు కొనసాగుతున్నాయి. దాబాల్లో మద్యం అమ్మరాదని...

    Heavy rains in North India | ఉత్తరాదిలో భారీ వర్షాలు.. హిమాచల్​లో 298 మంది బలి.. జేకేలో కుంగిన భారీ వంతెన..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Heavy rains in North India : ఉత్తర భారత్​లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి....

    More like this