అక్షరటుడే, వెబ్‌డెస్క్ :KTR | రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం(congress government) బీఆర్ఎస్ హయాంలో అవినీతి, అక్రమాలు జరిగిందని ఆరోపిస్తూ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయా కేసుల్లో విచారణ అధికారులు దూకుడు పెంచారు. ఇందులో భాగంగా ఫార్ములా ఈ కారు రేసు కేసులో సోమవారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఏసీబీ(ACB) ఎదుట హాజరు కానున్నారు. విచారణకు హాజరు కావాలని ఏసీబీ ఆయనను ఆదేశించింది.
KTR | కేసీఆర్‌తో భేటీ
కేటీఆర్(KTR) ఏసీబీ విచారణకు బయలు దేరారు. ఈ క్రమంలో నందినగర్‌లోని తన నివాసానికి చేరుకొని మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR)తో భేటీ అయ్యారు. కాసేపట్లో ఫార్ములా-ఈ కేసు(Formula-E Case)లో ఏసీబీ విచారణకు ఆయన హాజరు కానున్నారు. నందినగర్ నుంచి ఏసీబీ ఆఫీసుకు వెళ్లే దారిలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవల కాళేశ్వరం కమిషన్‌ను కేసీఆర్ విచారించినప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు.
KTR | దర్యాప్తు వేగవంతం
రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతి ఆరోపణలపై విచారణ వేగవంతం చేసింది. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwar Project)లో జరిగిన అక్రమాలపై కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్(Commission Chairman PC Ghosh) ఇటీవల మాజీ సీఎం కేసీఆర్‌ను విచారించిన విషయ తెలిసిందే.
మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు(phone tapping case)లో సిట్ అధికారులు ప్రభాకర్‌రావును ఇప్పటికే మూడు రోజులు విచారించారు. మంగళవారం మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. తాజాగా ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను ఫార్ములా ఈ కారు రేసు కేసులో విచారించనున్నారు. ఓ వైపు స్థానిక ఎన్నికలకు సిద్ధం అవుతున్న ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలే(BRS leaders) లక్ష్యంగా విచారణ చేపట్టడం గమనార్హం.