అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | చైనామాంజాతో ఎవరికైనా ప్రాణహాని కలిగితే సంబంధిత వ్యక్తులపై హత్యానేరంగా కేసు నమోదు చేస్తామని సీపీ సాయి చైతన్య హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా చైనా మాంజా (Chinese kite string) నిల్వ ఉంచినా.. తయారు చేసినా.. విక్రయించినా.. చట్టరీత్యా నేరమన్నారు.
CP Sai Chaitanya | చైనా మాంజా ఉంటే పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాలి
కొంతమంది ఇప్పటికే హైదరాబాద్ నుండి నిజామాబాద్‌కు (Hyderabad to Nizamabad) చైనామాంజా తరలించినట్లు తమకు సమాచారం ఉందని తెలిపారు. ఎవరిదగ్గరైనా చైనామాంజా ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్లో అప్పగించాలని సూచించారు. ఎవరైనా మాంజా బయట పడేసినట్లయితే ప్రజలకు, జంతువులకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. ఎవరైనా చైనా మాంజా విక్రయించి ఆ మాంజాతో ప్రమాదం జరిగినట్లయితే విక్రయదారులు కూడా కేసుకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎవరైనా చైనామాంజా ఉపయోగిస్తున్నట్లు సమాచారం తెలిస్తే తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్లో లేదా డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు.