అక్షరటుడే, ఇందూరు : Dinesh Kulachari | కబ్జాలు, మొరం, ఇసుక దందాలు రౌడీయిజం పెంచుతున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (MLA Bhupathi Reddy)పై కేసు నమోదు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో డీసీపీ బస్వారెడ్డి (DCP Baswareddy)ని కలిసి బుధవారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా దినేష్ కులాచారి (Dinesh Kulachari) మాట్లాడుతూ.. ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఇటీవల పాల్దా గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో.. సన్న బియ్యం, ఉచిత విద్యుత్తు కాంగ్రెస్సే ఇస్తున్నట్లు అసత్య ప్రచారం చేశారన్నారు. దీంతో అక్కడే ఉన్న యువకులు వీటిని కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందని చెప్పారన్నారు. ఈ క్రమంలో సదరు యువకులపై కొందరితో దాడి చేయించారన్నారు. కబ్జాలు, మొరం దందా చేస్తున్న నాయకులను వెంటపెట్టుకొని ఎమ్మెల్యే దాడులు చేయిస్తున్నారని వివరించారు.
జిల్లా పోలీస్ అధికారులు (Police Officers) వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు చేపడతామన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (PCC President Mahesh Kumar Goud) వెంటనే స్పందించి ఎమ్మెల్యే భూపతిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. బలహీనవర్గాలపై దాడులు చేస్తూ ఎమ్మెల్యే అనే అహంకారం ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నిజామాబాద్ రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, నాయకులు జగన్ రెడ్డి, ప్రమోద్, శంకర్, అధికార ప్రతినిధి శంకర్ రెడ్డి, ఆనంద్, విజయ్ కృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.