అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Case On Collector | మహబూబాబాద్ జిల్లా కలెక్టర్(Mahabubabad District Collector)పై కేసు నమోదైంది. తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు కలెక్టర్ అద్వైత కుమార్ పై కేసు పెట్టారు.
రాష్ట్రంలో యూరియా కొరత(Urea Shortage)తో రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పంటకు యూరియా ఎంతో అవసరం. అయితే సరిపడా యూరియా లేకపోవడంతో రైతులు(Farmers) అనేక అవస్థలు పడుతున్నారు. నిత్యం సొసైటీలు, ఎరువుల దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. గంటల తరబడి యూరియా కోసం లైన్లలో నిలుచుంటున్నారు. అర్ధరాత్రి నుంచే సొసైటీల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
Case On Collector | సొమ్మసిల్లి పడిపోయిన రైతు
యూరియా కోసం బారులు తీరుతున్న రైతులు క్యూలైన్లలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. గంటల కొద్ది లైన్లలో ఉండటంతో అస్వస్థతకు గురువుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల మహబూబాబాద్ జిల్లాలో అజ్మీరా లక్య అనే వృద్ధ రైతు యూరియా కోసం నిలబడి సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘం (Human Rights Association) ఆగ్రహం వ్యక్తం చేసింది. కలెక్టర్ అద్వైత్ కుమార్(Collector Advait Kumar)పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Case On Collector | తప్పని తిప్పలు
కేంద్రం ఇటీవల రాష్ట్రానికి భారీగా యూరియా కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. అయితే అది ఇంకా రాష్ట్రానికి చేరుకోలేదు. మరోవైపు పంటలు పొట్ట దశలో ఉండటంతో యూరియా అత్యవసరం. దీంతో రైతులు నిత్యం సొసైటీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పలు చోట్ల యూరియా దొరకక ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. అధికారులతో అన్నదాతలు వాగ్వాదం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా యూరియా కొరత నేపథ్యంలో కలెక్టర్‌పై కేసు నమోదు కావడం గమనార్హం