Homeజిల్లాలునిజామాబాద్​RTA Nizamabad | స్కూల్​ బస్సు​ల తనిఖీ.. కేసు నమోదు

RTA Nizamabad | స్కూల్​ బస్సు​ల తనిఖీ.. కేసు నమోదు

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: RTA Nizamabad | పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో రవాణాశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. మొదటిరోజు జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్​లో రవాణా శాఖ కమిషనర్ దుర్గా ప్రమీల ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. ఫిట్​నెస్​ పత్రాలతో పాటు నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని పరిశీలించారు. ఫిట్​నెస్​లేని ఒక స్కూల్ బస్సుపై కేసు నమోదు చేశారు. తనిఖీల్లో ఇన్​ఛార్జి డీటీవో రాహుల్​, ఎంవీఐ కిరణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

బోధన్​ పట్టణంలో..

బోధన్​ పట్టణంలో స్కూల్​ బస్​ను తనిఖీ చేస్తున్న ఎంవీఐ శ్రీనివాస్​

అక్షరటుడే, బోధన్: ఫిట్​నెస్​ లేని స్కూల్​ బస్సులు రోడ్లపైకి వస్తే కఠినచర్యలు తీసుకుంటామని బోధన్​ ఎంవీఐ శ్రీనివాస్​ హెచ్చరించారు. ప్రైవేట్​ స్కూల్​ యాజమాన్యాలు తప్పనిసరిగా తమ స్కూల్​ బస్సులను తనిఖీలు చేయించాలని సూచించారు. ఆర్టీవో నిబంధనల ప్రకారం బస్సులను నడపాలని పేర్కొన్నారు. బోధన్​ డివిజన్​లో 92 స్కూల్​ బస్సులు ఉండగా.. 80శాతం ఫిట్​నెస్​ పరీక్షలు పూర్తయ్యాయని తెలిపారు.