Homeజిల్లాలునిజామాబాద్​​ Bheemgal | అక్రమంగా ఇసుక తవ్వుతున్న వ్యక్తులపై కేసు నమోదు

​ Bheemgal | అక్రమంగా ఇసుక తవ్వుతున్న వ్యక్తులపై కేసు నమోదు

- Advertisement -

అక్షరటుడే, భీమ్​గల్: ​ Bheemgal | భీమ్​గల్​ మండలం బెజ్జోర గ్రామ శివారులో కప్పలవాగు (Kappalavaagu)లో ఇసుకను అక్రమంగా తవ్వుతున్న వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ (SI Sandeep) తెలిపారు.

బెజ్జోరా శివారులోని కప్పలవాగు నుంచి ఇసుకను జేసీబీలతో (JCB) ట్రాక్టర్లు నింపుతూ..తరలించే సమయంలో పోలీసులు దాడులు చేశారు. ట్రాక్టర్ యజమానులు ఈర్ల మహేందర్, మల్లెల స్వామి, దేశబోయిన రవికుమార్​లపై కేసు నమోదు చేసి, జేసీబీతో పాటు ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్​కు తరలించామన్నారు.

తదుపరి చర్యల నిమిత్తం ఏడీ మైన్స్​కు పంపనున్నట్లు ఆయన వివరించారు. భీమ్​గల్ మండలంలో అక్రమంగా ఇసుక, మొరం తరలిస్తే కఠినచర్యలు తప్పవని ఎస్సై సందీప్​ హెచ్చరించారు.