అక్షరటుడే, వెబ్‌డెస్క్: election strategist Prashant Kishor | ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ Jan Suraj Party అధినేత ప్రశాంత్ కిశోర్‌పై కేసు నమోదు అయింది.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే నెపంపై బీహార్ (Bihar) లోని వైశాలి జిల్లా రఘోపూర్ ఠాణాలో ప్రశాంత్ కిషోర్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ FIR నమోదు చేశారు.
election strategist Prashant Kishor | భారీ కాన్వాయ్‌తో..
అక్కడి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్టోబరు 11వ తేదీన రఘోపూర్ నియోజకవర్గంలో కిశోర్ ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించి వందలాది వాహనాల కాన్వాయ్‌తో నియోజకవర్గానికి వచ్చినట్లు స్థానిక సబ్-డివిజనల్ ఆఫీసర్ (ఎస్ఈఓ) ఫిర్యాదు చేశారు. ఎస్ఓ ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రశాంత్ కిషోర్‌పై కేసు ఫైల్ చేశారు.