అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nizamabad City | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ యువతిని వేధించిన కేసులో వైద్యుడితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారిపై (real estate businessman) కేసు నమోదైంది. యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరిపై నాలుగో టౌన్ పరిధిలో కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని ప్రముఖ డెంటల్ డాక్టర్ (dental doctor), రియల్ ఎస్టేట్ వ్యాపారి వేధింపులకు పాల్పడటం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో బాధితురాలు నగరంలోని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ.. తాను గతంలో ఓ ట్రావెల్స్‌లో పని చేశానని చెప్పింది.
అప్పటి నుంచి డెంటల్ డాక్టర్ అమర్నాథ్ (dental doctor Amarnath), రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆయిల్ గంగాధర్ తనపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించింది. సంస్థలో పని చేస్తున్న పనుల నిమిత్తం వచ్చి తనను అసభ్యంగా తాకేవారని వాపోయింది. అయితే అప్పుడు తనకు పెళ్లికాకపోవడంతో భయపడి ఎవరికి చెప్పలేదని తెలిపింది.
అక్కడ జాబ్ మానేసిన తర్వాత కూడా వారు వేధిస్తున్నారని ఆమె పేర్కొంది. ఈ మేరకు సోమవారం సీపీ సాయి చైతన్యను (CP Sai Chaitanya) కలిసి ఫిర్యాదు చేశానని పేర్కొంది. ఆయన సూచన మేరకు మంగళవారం నాలుగో టౌన్ ఠాణాలో ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. కాగా.. తాజాగా సదరు వైద్యుడు అమర్నాథ్, రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆయిల్ గంగాధర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై విచారణ కొనసాగుతున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
