అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Maganti Sunitha | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By Election) ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతపై కేసు నమోదైంది.
ఓటర్లను ప్రలోభపెడుతున్నారని సునీతతో (Maganti Sunitha) పాటు ఆమె కుమార్తె అక్షరపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం యూసుఫ్‌గడ డివిజన్‌లోని వెంకటగిరిలో గల మసీదు వద్ద సునీత, అక్షర ప్రచారం నిర్వహించారు. నమాజ్‌కు వచ్చిన ముస్లింలను కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటగిరిలో (Venkatagiri) నమాజ్ చేయడానికి వెళ్తున్న వారిని ఓటు వేయడానికి ప్రభావితం చేస్తున్నారని కేసు పెట్టారు.
Maganti Sunitha | ప్రచారంలో దూసుకుపోతున్న సునీత
బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అభ్యర్థిగా పేరు ఖరారు చేసినప్పటి నుంచి మాగంటి సునీత ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. పార్టీ నేతలతో కలిసి ప్రజల్లోకి వెళ్తున్నారు. తన భర్త, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చేసిన సేవలను గుర్తు చేస్తూ ఓట్లు వేయాలని కోరుతున్నారు. సోమవారం రహమత్‌నగర్‌లో నిర్వహించిన సమావేశంలోనూ సునీత కన్నీరు పెట్టుకున్నారు. మాగంటి గోపినాథ్‌ను తలుచుకుని కన్నీరుమున్నీరు కావడం కార్యకర్తలను కదిలించింది.