ePaper
More
    HomeతెలంగాణTest Tube Baby Center | భర్త కాకుండా వేరొకరి వీర్యంతో పిండం అభివృద్ధి.. టెస్ట్​...

    Test Tube Baby Center | భర్త కాకుండా వేరొకరి వీర్యంతో పిండం అభివృద్ధి.. టెస్ట్​ ట్యూబ్​ బేబీ సెంటర్​పై కేసు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Test Tube Baby Center | తల్లి కావడం ప్రతి మహిళ కల. ఆ క్షణం కోసం మహిళలు ఏంతో ఆత్రుతగా ఎదురు చూస్తారు. తమ బిడ్డను ఎత్తుకొని మురిసిపోవాలని దంపతులు (Couples) కలలు కంటారు. అయితే మారుతున్న జీవన పరిస్థితులతో పలు జంటలకు త్వరగా పిల్లలు కావడం లేదు. తల్లి కావాలన్న మహిళల ఆశలను ఆసరాగా తీసుకొని దేశంలో చాలా ఐవీఎఫ్​ (IVF), టెస్ట్​ ట్యూబ్​ బేబీ సెంటర్లు (Test Tube Baby Centers) పుట్టుకొచ్చాయి. అయితే డబ్బుల కోసం పలు సెంటర్లు మోసాలకు పాల్పడుతున్నాయి. తాజాగా తన భర్త వీర్యంతో కాకుండా వేరొకరి స్పెర్మ్​తో పిండం అభివృద్ధి చేశారని ఓ మహిళా టెస్ట్​ ట్యూబ్​ సెంటర్​పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    READ ALSO  Hydraa | నాలాల్లో ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలి.. హైడ్రా కమిషనర్​ కీలక ఆదేశాలు

    ఓ జంటకు వివాహమై ఏడేళ్లు అవుతున్నా పిల్లలు కాలేదు. దీంతో సికింద్రాబాద్ (Secunderabad)​లోని సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్​ను ఆశ్రయించారు. సదరు మహిళ అండం, ఆమె భర్త వీర్యంతో సెంటర్​లో పిండం అభివృద్ధి చేయాలి. అయితే సెంటర్​ నిర్వాహకులు ఆమె భర్త వీర్యంతో కాకుండా మరో వ్యక్తి వీర్యంతో పిండం అభివృద్ధి మహిళ గర్భంలో ప్రవేశ పెట్టారు. అనంతరం ఆమెకు మగ శిశువు పుట్టాడు.

    Test Tube Baby Center | అనారోగ్యానికి గురికావడంతో..

    తమకు బిడ్డ పుట్టారని ఆ దంపతులు ఎంతో ఆనందించారు. అయితే ఆ బాలుడు తరుచూ అనారోగ్యానికి గురి కావడంతో ఆస్పత్రిలో చూపెట్టారు. దీంతో బాలుడికి క్యాన్సర్​ ఉన్నట్లు తేలింది. అయితే తమ ఇద్దరి కుటుంబాల్లో ఎవరికి క్యాన్సర్​ లేకపోవడంతో అనుమానం వచ్చి డీఎన్​ఏ టెస్ట్ (DNA Test)​ చేయించారు. దీంతో అసలు నిజం వెలుగు చూసింది. భర్త వీర్యంతో కాకుండా మరొకరి వీర్యంతో పిండం అభివృద్ధి చేసినట్లు తేలింది. దీంతో బాధితులు టెస్ట్​ ట్యూబ్​ సెంటర్​పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    READ ALSO  Sri Chaitanya School | శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేయాలి.. విద్యార్థి సంఘాల నాయకుల ధర్నా

    Test Tube Baby Center | ఆశ పెట్టి లక్షలు దోచేస్తారు

    సంతానం కోసం దంపతులు పడే ఆరాటాన్ని కొందరు వైద్యులు డబ్బు సంపాదన మార్గం మలుచుకున్నారు. పెళ్లయి పిల్లలు కాని జంటల భావోద్వేగాలతో వ్యాపారం చేస్తున్నారు. ఐవీఎఫ్​, టెస్ట్​ట్యూబ్​ అని పేర్లు పెట్టి రూ.లక్షలు కాజేస్తున్నారు. తీరా డబ్బులు చెల్లించాక పిల్లలు పుడుతారా అంటే అది గ్యారంటీ లేదు. ఈ విధానంలో సక్సెస్​ రేటు అంతంత మాత్రంగానే ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఇందులోనూ పలు సెంటర్లు ఇలాంటి మోసాలకు పాల్పడుతుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    Test Tube Baby Center |డాక్టర్​ అరెస్ట్​

    సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ సెంటర్‌ డాక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైజాగ్‌, విజయవాడలో ఉన్న సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ సెంటర్లలో కూడా సోదాలు చేశారు. ఐవీఎఫ్​, సరొగసి కోసం పెద్ద ఎత్తున్న వీర్యం నిల్వ చేసినట్టు గుర్తించారు. వీర్య సేకరణ కోసం అక్రమ పద్ధతిని పాటిస్తున్నట్లు తేలడంతో సెంటర్‌లో పనిచేస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.

    READ ALSO  Hyderabad | వెళ్లిపోయిన పెళ్ళాన్ని తెచ్చుకుంటే.. ప్రాణాలు తీయాలని చూసింది..

    Latest articles

    Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sports Policy | రాష్ట్రంలో యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్​ వంటి మాదకద్రవ్యాలకు...

    Kamareddy | సోషల్ మీడియా వేదికగా దోపిడీ.. ముఠా ఆటకట్టించిన పోలీసులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల...

    Coolie Trailer | సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ట్రైల‌ర్ విడుద‌ల‌.. విల‌న్‌గా మారి అద‌ర‌గొట్టిన కింగ్‌ నాగార్జున

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Coolie Trailer | సూపర్‌స్టార్ రజినీకాంత్ (Super Star Rajinikanth) సినిమా వస్తోంది అంటే...

    ENGvIND | ఇంగ్లండ్ బౌల‌ర్ల స‌హ‌నాన్ని ప‌రీక్షించిన జైస్వాల్, ఆకాశ్.. భార‌త్ ఆధిక్యం ఎంతంటే!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ENGvIND | ఇంగ్లండ్‌తో జరుగుతున్న అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ (Anderson-Tendulkar Trophy) చివరి టెస్టు (ఓవల్...

    More like this

    Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sports Policy | రాష్ట్రంలో యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్​ వంటి మాదకద్రవ్యాలకు...

    Kamareddy | సోషల్ మీడియా వేదికగా దోపిడీ.. ముఠా ఆటకట్టించిన పోలీసులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల...

    Coolie Trailer | సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ట్రైల‌ర్ విడుద‌ల‌.. విల‌న్‌గా మారి అద‌ర‌గొట్టిన కింగ్‌ నాగార్జున

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Coolie Trailer | సూపర్‌స్టార్ రజినీకాంత్ (Super Star Rajinikanth) సినిమా వస్తోంది అంటే...