అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bellamkonda Srinivas | రెండు రోజుల క్రితం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Sai Srinivas) రాంగ్ రూట్లో వెళ్లడమే కాకుండా అక్కడ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్(Constable)పైకి కారుతో దూసుకెళ్లాడు. అప్రమత్తమైన కానిస్టేబుల్ ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్‌ను నిలదీయగా కాస్త ఓవరాక్షన్ చేసి పలాయనం చిత్తగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ ఓ రేంజ్లో ఇచ్చిపడేశారు. మరోవైపు ఈ ఘటనపై ట్రాఫిక్ కానిస్టేబుల్(Traffic Constable) ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas)పై పోలీసు కేసు నమోదైంది. అయితే ఈ ఘటనపై ఇంత వరకు బెల్లంకొండ స్పందించలేదు.
Bellamkonda Srinivas | కేసు నమోదు..
బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల సంగతికొస్తే.. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ Sureshవారసుడిగా ‘అల్లుడి శీను’తో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాడు.. ఆ తర్వాత కవచం, రాక్షసుడు, జయ జానకీ నాయకా, సాక్ష్యం.. వంటి చిత్రాలు చేయగా, ఈ చిత్రాలు ఓ మోస్తరు విజయాలు అందుకున్నాయి. రాక్షసుడు(Rakshasudu) ఒక్కటే బెల్లంకొండ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇటీవల బ్యాడ్ టైమ్‌తో వరుస పరాజయాలు చూస్తున్నాడు. హిందీలో తీసిన ‘ఛత్రపతి’ రీమేక్ డిజాస్టర్ కావడంతో సైలంట్ అయిపోయాడు. ప్రస్తుతం ‘భైరవం’ సినిమాలో నటిస్తూ గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాడు. ఇందులో నారా రోహిత్, మంచు మనోజ్ కూడా నటిస్తున్నారు.
భైరవం Bhairavam చిత్రానికి కనకమేడల విజయ్ డైరెక్టర్ శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కెకె రాధామోహన్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 30న విడుదల కాబోతుంది. బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas) చేతిలో ఇంకా టైసన్ నాయుడు, కిష్కిందపురి, హైందవ చిత్రాలు కూడా ఉన్నాయి. డ్యాన్సులు, ఫైట్లు బాగానే చేస్తున్నా మొహంలో ఎక్స్ప్రెషన్ సరిగ్గా పలకడం లేదని అందుకే బెల్లంకొండ శ్రీనివాస్ ఎదగలేకపోతున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. వచ్చే సినిమాల్లో అయినా ఆ బలహీనతలను దాటుకుని మంచి సక్సెస్ కొట్టాలని, లేని పోని వివాదాలలో దూరి కెరియర్ నాశనం చేసుకోవద్దని పలువురు సూచిస్తున్నారు.