Homeజిల్లాలుకామారెడ్డిKamareddy SP | మంత్రిని అడ్డుకున్న ఆరుగురిపై కేసు: ఎస్పీ రాజేష్ చంద్ర

Kamareddy SP | మంత్రిని అడ్డుకున్న ఆరుగురిపై కేసు: ఎస్పీ రాజేష్ చంద్ర

జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్కను అడ్డుకున్న ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ రాజేష్​ చంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం వివరాలు వెల్లడించారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్కను (Minister Seethakka) అడ్డుకున్న ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ రాజేష్​ చంద్ర (SP Rajesh Chandra) తెలిపారు. ఈ మేరకు గురువారం సాయంత్రం వివరాలు వెల్లడించారు.

రామారెడ్డి (Ramareddy) వద్ద కొందరు బీఆర్ఎస్ నాయకులు, రైతులు మంత్రిని అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే రైతుల ముసుగులో వచ్చి మంత్రి కాన్వాయ్‌ (minister convoy) ముందుకు అకస్మాత్తుగా వచ్చి అడ్డుకున్నారని ఎస్పీ తెలిపారు. దీంతో ప్రమాదం సంభవించే అవకాశం ఉండగా, డ్రైవర్ చాకచక్యంగా బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు.

డ్యూటీలో ఉన్న సంబంధిత పోలీసు అధికారి దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు కాన్వాయ్‌ను అడ్డుకున్న ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. రామారెడ్డి బీఆర్ఎస్ నాయకుడు పడిగల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి, ఉప్పల్​వాయి మాజీ సర్పంచ్ కొత్తోల్ల గంగారాం, రామారెడ్డికి చెందిన బాలదేవ్ అంజయ్య, రామారెడ్డి బీఆర్ఎస్ నాయకుడు ద్యాగల మహిపాల్, హన్మయల్లా రాజయ్యలపై కేసు నమోదైందని తెలిపారు.