Homeతాజావార్తలుMaganti Sunitha | మాగంటి సునీతపై కేసు.. ఎందుకో తెలుసా?

Maganti Sunitha | మాగంటి సునీతపై కేసు.. ఎందుకో తెలుసా?

మాగంటి సునీతపై బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా బీఆర్​ఎస్​ గుర్తులతో ఉన్న ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్​ నాయకులు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Maganti Sunitha | జూబ్లీహిల్స్​ బీఆర్​ఎస్​ అభ్యర్థి మాగంటి సునీతపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) గుర్తు ఉన్న ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్​ నాయకులు ఫిర్యాదు చేయడంతో బోరబండ పోలీసులు కేసు ఫైల్​ చేశారు.

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలు (Jubilee Hills by-Elections) సమీపిస్తున్నాయి. నవంబర్​ 11న నియోజకవర్గంలో పోలింగ్​ జరగనుంది. దీంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఓటరు స్లిప్పులు పంపిణీ చేయొద్దని గతంలో ఎన్నికల సంఘం (Election Commission) పార్టీలను ఆదేశించింది. ఎన్నికల సిబ్బంది మాత్రమే వాటిని పంపిణీ చేస్తారని చెప్పింది. అయినా కూడా బీఆర్​ఎస్​ నాయకులు ఓటరు స్లిప్పులు పంపిణీ చేసినట్లు కాంగ్రెస్​ మీడియా, కమ్యూనికేషన్​ ఛైర్మన్​ మోహన్​రెడ్డి రిటర్నింగ్​ అధికారికి ఫిర్యాదు చేశాడు. దీంతో బోరబండ పోలీస్​ స్టేషన్​లో (Borabanda Police Station)​ ఆమెపై కేసు నమోదైంది.

Maganti Sunitha | గతంలో సైతం..

మాగంటి సునీతపై (Maganti Sunitha) గతంలో సైతం కేసు నమోదైంది. సునీత, ఆమె కూతురు అక్షర ఓ మసీదు వద్ద ప్రచారం చేశారని గతంలో కాంగ్రెస్​ నాయకులు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ప్రార్థన స్థలాల వద్ద అనుమతులు తీసుకోకుండా ఎన్నికల ప్రచారం చేశారని గతంలో కేసు పెట్టారు. సునీత, అక్షరతో పాటు యూసుఫ్‌గూడ కార్పొరేటర్‌ రాజ్‌కుమార్‌ పటేల్‌తో పాటు మరో నలుగురిపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.