అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలోని పీవీ ఎక్స్ప్రెస్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున మూడు కార్లు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
నగరంలోని పీవీ ఎక్స్ప్రెస్ హైవే (PV Express Highway)పై మూడు కార్లు ఒకదానికి ఒకటి పరస్పరం ఢీకొన్నాయి. పిల్లర్ నంబర్ 112 దగ్గర ఈ ప్రమాదం జరిగింది. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) వెంటనే చర్యలు చేపట్టారు. వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
Hyderabad | స్వల్ప గాయాలు
కార్లు ఢీకొనడంతో అందులో ఉన్న వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున పొగమంచు కారణంగా వాహనాలు కనిపించక ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Hyderabad | జాగ్రత్తలు పాటించాలి
రాష్ట్రంలో చలితీవ్రత పెరిగింది. రెండు రోజులుగా పొగమంచు విపరీతంగా కురుస్తోంది. తెల్లవారు జామున ఎదురుగా ఉన్న మనిషి కూడా కనిపించనంతగా మంచు కప్పేస్తోంది. దీంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల ఢిల్లీ (Delhi)లో పొగమంచు కారణంగా పదుల సంఖ్యలో వాహనాలు ఢీకొన్నాయి. రాష్ట్రంలో సైతం అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఉదయం పూట హైవేలపై వెళ్లేవారు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.