అక్షరటుడే, వెబ్‌డెస్క్ : US Open Final | యూఎస్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్‌కు చెందిన కార్లోస్ అల్కరాస్(Carlos Alcaraz) దక్కించుకున్నాడు.
ఇటలీ ఆటగాడు యానిక్ సిన్నర్ పై 6-2, 3-6, 6-1, 6-4 తేడాతో విజయం సాధించి ద్వితీయ యూఎస్ ఓపెన్ టైటిల్, మొత్తం ఆరవ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ విజయం ద్వారా అల్కరాస్, గత 65 వారాలుగా వరల్డ్ నంబర్ 1 ర్యాంక్‌లో ఉన్న సిన్నర్‌ను ఓడించి, మళ్లీ ప్రపంచ నంబర్ 1 ర్యాంక్(World No.1 Rank) దక్కించుకున్నాడు.
మ్యాచ్ హైలైట్స్:
- మొత్తం వ్యవధి: 2 గంటల 42 నిమిషాలు
- ఫస్ట్ సెట్: అల్కరాస్ 6-2 (ఆరంభమే అదిరింది)
- సెకండ్ సెట్: సిన్నర్ 6-3 (వాపస్ ఫైట్)
- తృతీయ సెట్: అల్కరాస్ 6-1 (పూర్తి ఆధిపత్యం)
చివరి సెట్ : 6-4 తో అల్కరాస్ విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
చివరి సెట్ హోరాహోరీగా సాగింది. ఒత్తిడిని సమర్థవంతంగా తట్టుకుని, అద్భుతమైన ఫోర్‌హ్యాండ్స్, క్లీన్ విన్నర్లతో అల్కరాస్ ఫైనల్‌కు ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
సిన్నర్ vs అల్కరాస్ మధ్య మూడవ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఇది కాగా , ప్రస్తుతం అల్కరాస్ 2-1 ఆధిక్యంలో ఉన్నాడు. హార్డ్‌కోర్ట్ మ్యాచ్‌లలో అల్కరాస్ 7-2తో స్పష్టమైన ఆధిక్యంలో ఉండగా మొత్తంగా 15 మ్యాచ్‌లలో అల్కరాస్ 10-5తో సినర్‌పై ముందంజలో ఉన్నాడు. తన విజయం తర్వాత కార్లోస్ అల్కరాస్ కోర్టులోనే ప్రత్యేకంగా క్రికెట్ బ్యాటింగ్ పోజ్ ఇచ్చి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఈ విజయంతో కార్లోస్ అల్కరాస్ తన కెరీర్‌లో మరో గొప్ప అధ్యాయాన్ని లిఖించుకున్నాడు . మరోవైపు ఈ విజయంతో ఒకే ఏడాదిలో అల్కరాస్ రెండు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు(Grand Slam Titles) నెగ్గిన ఘనత సాధించాడు. 2024 నుంచి ఎనిమిది మ్యాచ్‌లలో ఈ ఇద్దరు ఆటగాళ్లు ఓటీ పడగా ఆరింటిలో సిన్నర్ గెలువగా, అల్కరాజ్ రెండింటిలో మాత్రమే విజయం సాధించాడు. అవికూడా ఫైనల్స్ కావడం గమనార్హం.