ePaper
More
    Homeక్రీడలుLliverpool Football | అభిమానుల గుంపులోకి దూసుకెళ్లిన కారు.. 50 మందికి పైగా గాయాలు..!

    Lliverpool Football | అభిమానుల గుంపులోకి దూసుకెళ్లిన కారు.. 50 మందికి పైగా గాయాలు..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Liverpool Football | లివర్‌పూల్ Liverpoolలో ఊహించ‌ని ఘటన చోటు చేసుకుంది. లివర్‌పూల్ ప్రీమియర్ లీగ్ టైటిల్ విజయాన్ని ఆస్వాదిస్తున్న జనంపైకి ఓ కారు దూసుకెళ్ల‌డంతో ఈ ఘటనలో నలుగురు చిన్నారులు సహా దాదాపు 50 మందికిపైగా గాయాలపాలయ్యారు.

    లండన్ London లో లివర్‌పూల్ ఫుట్‌బాల్ జట్టు అభిమానులు తమ జట్టు (Liverpool Football Fans Accident) ప్రీమియర్ లీగ్ ఛాంపియన్‌షిప్ విజయాన్ని సోమవారం సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో ఓ కారు వారి మధ్యలోకి అనుకోకుండా దూసుకొచ్చింది. ఈ ఘటనలో చాలా మంది గాయ‌ప‌డ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఎయిర్ అంబులెన్స్‌తో సహా ఇతర అత్యవసర వాహనాలను ఆ ప్రాంతంలో మోహరించి సహాయక చర్యలు చేపట్టారు.

    Lliverpool Football | ఊహించ‌ని విషాదం..

    ప్రీమియర్‌ లీగ్‌లో 20వ టైటిల్‌ను లివర్‌పూల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా లివర్‌పూల్‌లో ఆ జట్టు భారీగా సంబరాలు చేసుకుంది. అభిమానులకు అభివాదం చేస్తూ వీధుల్లో విక్టరీ పరేడ్ నిర్వ‌హించింది. లివర్‌పూల్ ఫ్యాన్స్ భారీగా గుమికూడిన సమయంలో, ఓ 53 ఏళ్ల బ్రిటిష్ వ్యక్తి British Person తన వాహనాన్ని వేగంగా నడిపించి, అభిమానుల మధ్యలోకి దూసుకొచ్చాడు.. ఈ ఘటన జరిగిన వెంటనే, అత్యవసర సేవలు స్పందించి, గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించాయి. సహాయక చర్యలు వేగంగా చేపట్టినందున ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనకు కారణమైన 53 ఏళ్ల తెల్లజాతి బ్రిటిష్ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు.

    మరోవైపు గాయపడిన వారిలో కనీసం 27 మందిని ఆసుపత్రికి తరలించినట్లు ఓ అధికారి తెలిపారు. స్వల్ప గాయాలతో ఉన్న మరో 20 మందికి సంఘటనాస్థలంలోనే చికిత్స అందించినట్లు చెప్పారు. ఈ షాకింగ్‌ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా పరిగణించట్లేదని, ఇది ఒక వ్యక్తి చేసిన చర్యగా పేర్కొన్నారు అధికారులు.

    బ్రిటన్ ప్రధాని కీర్‌ స్టార్మర్ ఈ ఘటనను నిరాశాజనకమైనదని అభివర్ణించారు. అత్యవసర సేవల ప్రతిస్పందనను ప్రశంసించారు. లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్ Foot Ball Club, ప్రీమియర్ లీగ్ ఈ ఘటనపై తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దీనిపై అనవసరమైన ఊహాగానాలు చేయకుండా, అధికారిక సమాచారం మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని అధికారులు సూచించారు. బ్రిటన్‌లోని వివిధ రాజకీయ నాయకులు, ప్రజలు దీనిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

    More like this

    Stock Markets | ఐటీలో కొనసాగిన జోరు.. లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Stock Markets | భారత్‌, యూఎస్‌ల మధ్య ట్రేడ్‌ డీల్‌(Trade deal) వైపు అడుగులు...

    Kamareddy | సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...