54
అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణంలోని భవానీ నగర్ కాలనీలో ఓ యువకుడు మద్యం మత్తులో కారు నడిపి హంగామా చేశాడు.
కాలనీలో రోడ్డు పక్కన నిలిపిన బైక్లు, స్కూటీలపైకి (bikes and scooters) కారు దూసుకెళ్లగా పలు వాహనాలు పాక్షికంగా ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారు నడిపిన యువకుడిని అదుపులోకి తోసుకున్నట్టు సమాచారం.