అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Makloor mandal | కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటన మాక్లూరు మండలం (Makloor mandal) కల్లెడలో చోటు చేసుకుంది. బోర్గాం(కె) గ్రామానికి చెందిన రాజారపు శ్రీనివాస్ కల్లెడ గ్రామంలో బంధువుల పెళ్లికి వెళ్లాడు. బుధవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో కారులో స్వగ్రామానికి బయలు దేరాడు. అయితే కల్లెడ గ్రామ శివారులో కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో శ్రీనివాస్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.
