Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | బ్రిడ్జి గుంతలో కారు బోల్తా.. ఇద్దరి దుర్మరణం

Yellareddy | బ్రిడ్జి గుంతలో కారు బోల్తా.. ఇద్దరి దుర్మరణం

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. నూతనంగా నిర్మిస్తున్న వంతెన(Bridge) గుంతలో కారు బోల్తా పడగా.. ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా(Kamareddy District) ఎల్లారెడ్డి మండలం మల్లయ్యపల్లి గేటు వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్​ నుంచి బోధన్​ వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు సాగుతున్నాయి. ఇందులో భాగంగా మల్లయ్యపల్లి గేటు(Mallaiahpalli Gate) వద్ద వంతెన నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జి గుంతలో ప్రమాదవశాత్తు కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

Yellareddy | మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

మృతులది మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నర్సింగ్ రావుపల్లి తండాగా(Narsing Raopalli Thanda) గుర్తించారు. వీరు వర్ని మండలం పెద్దగుట్టకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో డ్రైవర్​ పీర్యా(38), మరో వ్యక్తి పీర్యా(32) మృతి చెందారు. గాయపడ్డ ముగ్గురిని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాంట్రాక్టర్​ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు, వాహనదారులు ఆరోపిస్తున్నారు. పనులు జరుగుతున్న చాలా చోట్ల కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదని మండిపడుతున్నారు. వారి నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని సంబంధిత కాంట్రాక్టర్(Contractor)​, అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.