అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | అదుపు తప్పి కారు బోల్తా పడిన ఘటన ఇందల్వాయి మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గన్నారం (gannaram) గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై (National Highway 44) కారు టైరు పేలింది. దీంతో పల్టీలు కొడుతూ రోడ్డు కిందికి వెళ్లింది.
ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు కాగా జిల్లా కేంద్రానికి చెందిన ముగ్గురికి స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ (Shamshabad Airport) నుంచి వస్తుండగా గన్నారం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.