అక్షరటుడే, డిచ్పల్లి : Nizamabad City | ఓ కారు అదుపు తప్పి డ్రెయినేజీలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన నగర శివారులోని మాధవ నగర్ సాయిబాబా ఆలయం (Sai Baba Temple) వద్ద చోటు చేసుకుంది.
సాయిబాబా ఆలయం వద్ద ఆర్వోబీ పనులు (ROB work) జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో రోడ్డు గుంతలమయంగా మారింది. ఈ క్రమంలో శనివారం ఉదయం ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న డ్రెయినేజీలో పడిపోయింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో కారులోని వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు.
కాగా.. ఆర్వోబీ వద్ద రోడ్డు అధ్వానంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షానికి రోడ్డు బురదమయంగా మారి పలువురు ద్విచక్ర వాహనదారులు సైతం జారి పడుతున్నారు.