Homeజిల్లాలునిజామాబాద్​Dharpalli | బ్రిడ్జి పైనుంచి వాగులో పడ్డ కారు.. యువకుడి మృతి

Dharpalli | బ్రిడ్జి పైనుంచి వాగులో పడ్డ కారు.. యువకుడి మృతి

ఓ యువకుడు కారుతో సహా వాగులో పడి మృతి చెందాడు. ఈ ఘటన ధర్పల్లి మండలం మైలారం వద్ద చోటు చేసుకుంది.

- Advertisement -

అక్షరటుడే, ఇందల్వాయి : Dharpalli | ఓ యువకుడు కారుతో సహా వాగులో పడి మృతి చెందాడు. ఈ ఘటన ధర్పల్లి మండలం (Dharpalli mandal) మైలారం వద్ద చోటు చేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలారం గ్రామానికి (Mylaram village) చెందిన బాలు కారులో వెళ్తుండగా కోరట్​పల్లి – మైలారం మధ్యగల వంతెన పైనుంచి వాగులో పడిపోయాడు. ఆదివారం రాత్రి సమయంలో యువకుడు వాగులో పడ్డాడు. అయితే కారు నీటిలో మునగడంతో ఎవరు గమనించలేదు. దీంతో అందులోనే మృతి చెందాడు. సోమవారం అటువైపు వెళ్లిన వారు వాగులో కారును గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో జేసీబీ సాయంతో కారును బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్​ ప్రభుత్వ ఆస్పత్రికి (Nizamabad Government Hospital) తరలించారు.

Must Read
Related News