అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vijayanagarm | ఆంధ్రప్రదేశ్ APలోని విజయనగరం Vijayanagarm జిల్లాలో విషాదం నెలకొంది. కారు డోర్ లాక్ car door lock కావడంతో నలుగురు చిన్నారులు మృతి చెందారు. విజయనగరం జిల్లాలోని ద్వారంపూడి dwarampood లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో మహిళా మండల కార్యాలయం వద్ద ఆగి ఉన్న ఒక కారులో సరదాగా కూర్చునేందుకు వెళ్లి చిన్నారులు డోర్ వేసుకున్నారు. దీంతో కారు డోర్ లాక్ పడడంతో ఊపిరి ఆడక నలుగురు మృతి చెందారు.
మంగి బుచ్చిబాబు, భవాని దంపతుల కుమారుడు ఉదయ్ (8), బుర్లు ఆనంద్ ఉమా దంపతుల ఇద్దరు కుమార్తెలు చారుమతి (8), చరిష్మా (6), కంది సురేష్ అరుణ దంపతుల కుమార్తె మనస్విని మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు చిత్తూరు chittoor జిల్లా కుప్పం kuppam మండలంలోని దేవరాజుపురంలో నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఆడుకోవడానికి వెళ్లిన గౌతమి(7), శాలిని(6), అశ్విన్(7) ప్రమాదవశాత్తు కుంటలో పడి మరణించారు.
కాగా ఇటీవల రంగారెడ్డి rangareddy జిల్లాలో సైతం ఓ చిన్నారి కారులో ఊపిరాడక చిన్నారి మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా మక్తమాదారం గ్రామంలో ఆడుకుంటూ ఇంటి ఎదుట నిలిపి ఉన్న కార్లోకి ఎక్కి డోర్ అక్షయ డోర్ వేసుకుంది. డోర్ ఓపెన్ కాకపోవడంతో ఊపిరాడక కారులోనే మృతి చెందింది. ఇలాంటి ఘటనలు తరుచూ చోటు చేసుకుంటూ ఉండటంతో హైదరాబాద్ పోలీసులు ఇటీవల చిన్నారుల విషయంలో కారు ఓనర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డోర్ లాక్ చేసే ముందు లోపల ఎవరైనా ఉన్నారేమో చూడాలని, పార్క్ చేసిన సమయంలో తప్పనిసరిగా లాక్ చేయాలన్నారు.