అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai Mandal | అదుపు తప్పి చెట్టుకు కారు ఢీకొనడంతో ఇద్దరు యువకులు గాయాలపాలయ్యారు. ఇందల్వాయి మండలం (Indalwai Mandal) డొన్కల్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. జక్కుల లింగం, సంజీవరెడ్డి అనే ఇద్దరు యువకులు కారులో ఇందల్వాయి నుంచి డొన్కల్ గ్రామానికి (Donkal village) వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది.
Indalwai Mandal | స్పందించిన గ్రామస్థులు..
చెట్టుకు కారు ఢీకొన్న కారు భారీ శబ్దం రావడంతో గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. వెంటనే ఇళ్లలో నుంచి బయటకు వచ్చి చూడగా.. కారులో ఉన్న ఇద్దరు తీవ్ర గాయాలతో కనిపించారు. స్పందించిన గ్రామస్థులు వెంటనే ఓ ప్రైవేట్ వాహనంలో క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌కు (Government General Hospital) తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.