అక్షరటుడే, కామారెడ్డి : Car Crash on Highway | ప్రమాదవశాత్తు అదుపుతప్పిన ఓ కారు డివైడర్‌ను ఢీకొని అవతలి వైపు నుంచి వెళ్తున్న కంటైనర్ ఢీకొంది. దీంతో కారు మంటల్లో దగ్ధమైంది. ఈ ఘటన మంగళవారం సదాశివనగర్ మండలం (Sadashivanagar Mandal) పద్మాజీవాడి బైపాస్ రహదారిపై చోటుచేసుకుంది.
Car Crash on Highway | హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు..
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ (Hyderabad to Nizamabad) వైపు కియా సెల్టోస్ కారులో రాహుల్ అనే వ్యక్తి వెళ్తున్నాడు. పద్మాజీవాడి బైపాస్ బ్రిడ్జిపైకి కారు చేరుకోగానే కారు అదుపుతప్పి ఒక్కసారిగా డివైడర్‌ను ఢీకొట్టింది. కొద్దిదూరం అలాగే డివైడర్‌కు ఆనుకుని వెళ్లి అవతలి వైపునకు హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్‌ను ఢీకొంది.
క్షణాల్లోనే మంటలు..
ఈ క్రమంలో కారులో నుంచి మెరుపులు రావడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో వెళ్తున్న రాహుల్‌కు స్వల్ప గాయాలు కాగా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది సాయంతో మంటలను ఆర్పివేశారు. గాయాలైన రాహుల్‌ను అంబులెన్స్ ద్వారా జీజీహెచ్ (GGH) తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని తెలిపిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.