1
అక్షరటుడే, బాన్సువాడ: Banswada | బాన్సువాడ ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల (SRNK Government Degree College) ముందు గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంసాగర్ మండలం (Nizamsagar mandal) కోమలంచ గ్రామానికి చెందిన సూర్య ద్విచక్రవాహనంపై బోధన్ వైపు ప్రయాణిస్తుండగా.. ఎదురుగా అతివేగంగా వస్తున్న కారు బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సూర్య కాలి వద్ద తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.