120
అక్షరటుడే, ఆర్మూర్: Aloor Mandal | బంగ్లాదేశ్‌లో (Bangladesh) హిందువులపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆలూర్‌లో (Aloor) హిందూ, ప్రజాసంఘాలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులు బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అరాచకాలకు ఖండించారు.
Aloor Mandal | అత్యంత బాధాకరం
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు, హింసాత్మక ఘటనలు అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ హక్కులను కాలరాస్తూ జరిగిన హత్యలను అంతర్జాతీయ సమాజం ఖండించాలని డిమాండ్ చేశారు. మూక దాడిలో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువకులు, మహిళలు పాల్గొన్నారు.