అక్షరటుడే, ఇందల్వాయి: Dinesh Kulachari | రానున్న స్థానిక ఎన్నికల్లో (local Body elections) బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పాటుపడాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (BJP District President Dinesh Kulachari) పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ మండలాల్లో సమావేశం నిర్వహించారు.
ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు (MPTC and ZPTC elections) జరగనున్నందున బీజేపీ అభ్యర్థులు అలర్ట్గా ఉండాలన్నారు. ప్రతి కార్యకర్త అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలన్నారు. రానున్న ఎన్నికలు జిల్లాలో మెజార్టీ స్థానాలు బీజేపీ కైవసం చేసుకోబోతుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్న నిధులు, అభివృద్ధి పనులకు స్పష్టం తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆయన వెంట రాష్ట్ర దిశ కమిటీ సభ్యుడు ప్రదీప్ రెడ్డి, పార్టీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు కేపీ రెడ్డి, ఇందల్వాయి మండల అధ్యక్షుడు లోలం సత్యనారాయణ, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.