అక్షరటుడే, ఆర్మూర్: Panchayat Elections | పంచాయతీ పోరు రసవత్తరంగా సాగుతోంది. కౌంటింగ్‌లో భాగంగా ఫలితాల వారీగా విజేతలను ప్రకటిస్తున్నారు. అయితే కొన్ని సర్పంచ్ (sarpanch election) ఫలితాల్లో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి.
Panchayat Elections | నందిపేట్ మండలం కంఠంలో..
నందిపేట మండలం (Nandipet mandal) కంఠం గ్రామంలో సర్పంచ్ ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగింది. బీజేపీ మద్దతు పలికిన సాయినాథ్, కాంగ్రెస్ మద్దతు పలికిన అభ్యర్థి ఇంద్రుడు మధ్య గట్టిపోటీ నడిచింది. అయితే చివర్లో ఇద్దరికి సమానంగా 711 ఓట్లు వచ్చాయి. దీంతో రీకౌంటింగ్ నిర్వహించినప్పటికీ ఓట్లు సమానంగా రాగా.. అధికారులు చివరికి టాస్ వేశారు. టాస్‌లో బీజేపీ అభ్యర్థి సాయినాథ్ ఎట్టకేలకు విజయం సాధించాడు. కౌంటింగ్ సందర్భంగా చిన్నపాటి వాగ్వాదాలు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు అదనపు బలగాలను దింపారు. ఎన్నిక అనంతరం పోలీసుల ఆధ్వర్యంలో ఇరువర్గాలను సముదాయించారు.