89
అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | పంచాయతీ ఎన్నికల్లో (Panchayat elections) పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను తప్పక పాటించాలని ఎస్సై మహేశ్ పేర్కొన్నారు. మండలంలోని కళ్యాణి, తిమ్మారెడ్డి, అన్నాసాగర్ గ్రామ ఓటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ (Election Commission) నిమయ నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థులు, ఓటర్లు నడుచుకోవాలని సూచించారు.
Yellareddy | వ్యక్తిగత దూషణలు చేయవద్దు..
వ్యక్తిగత దూషణలు, ఇతర వర్గాలను కించపర్చేలా వ్యాఖ్యలు చేయవద్దని.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. 12వ తేదీ సాయంత్రం 5 గంటల తర్వాత ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని స్పష్టం చేశారు. ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాల్లో సెల్ఫోన్లకు అనుమతి ఉండదని చెప్పారు.