అక్షరటుడే, వెబ్డెస్క్: Cancer | భారతదేశంలో ఏటా లక్షల సంఖ్యలో ప్రాణాంతక క్యాన్సర్ కేసులు నమోదవుతుండగా.. దీనికి కేవలం పొగాకు వంటివి మాత్రమే కాకుండా, మన రోజువారీ జీవనశైలి, ఆహారపు అలవాట్లు ప్రధాన కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉత్తర్ప్రదేశ్ Uttar Pradesh లఖ్నవూ Lucknow లోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ Medical University కి చెందిన డా. జ్యోతికా రాజావత్ షా ప్రకారం, మనం నిత్యం ఉపయోగించే సుమారు 200 రకాల వస్తువులు ఈ వ్యాధికి కారకాలుగా మారుతున్నాయని తాజా పరిశోధనల్లో గుర్తించారు.
Cancer |
ఈ ప్రమాదకర వస్తువుల జాబితాలో ముఖ్యంగా జంక్ ఫుడ్, ఒకసారి వాడిన నూనెను మళ్లీ ఉపయోగించడం, రసాయన పూతతో కూడిన ప్యాకేజీలు ఉన్నాయి. ఉదాహరణకు, వంట నూనెను 100 డిగ్రీల ఉష్ణోగ్రతకుపైగా పలుసార్లు వేడి చేసినప్పుడు వాటిలో క్యాన్సర్ కారక రసాయనాలు విడుదలవుతాయి.
అలాగే, ఎండకు తగిలే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లలోని రసాయనాలు నీటిలో కరిగి ప్రమాదకరంగా మారుతాయి. చైనీస్ ఫుడ్ సాస్లు, క్యాండీలు, ఎరుపు లేదా నారింజ కృత్రిమ రంగులతో కూడిన స్నాక్స్లలోనూ హానికర రసాయనాలు ఉంటాయని డా. జ్యోతికా వెల్లడించారు. అంతేకాకుండా, టీ బ్యాగులు, డిస్పోజబుల్ కప్పులపై ఉండే ప్లాస్టిక్ కోటింగ్లు, మైక్రోవేవ్ ప్లాస్టిక్ కంటైనర్లు వేడికి గురైనప్పుడు విషపూరితాలను విడుదల చేస్తాయి.
Cancer |
మరోవైపు, భారత మహిళల్లో రొమ్ము , సర్వైకల్ క్యాన్సర్లు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ, 50-60% మంది పట్టణ మహిళలకు వీటి లక్షణాలపై సరైన అవగాహన లేకపోవడం ఆందోళనకరం. దీంతో సరైన సమయంలో చికిత్స అందడం లేదు. అందుకే మహిళలు రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్లకు సంబంధించి తప్పనిసరిగా స్వీయ పరీక్షలు చేసుకోవాలని, ఏ చిన్న మార్పు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆమె సూచించారు.
క్యాన్సర్ నిర్మూలనలో జీవనశైలి అలవాట్లపై అవగాహన కల్పించడం ఎంతో కీలకం. ప్లాస్టిక్ వాడకం, ప్రాసెస్ చేసిన ఆహారం, వాడిన నూనెను మళ్లీ వాడటం వంటి అలవాట్లను మానుకుంటే క్యాన్సర్ ముప్పును గణనీయంగా తగ్గించవచ్చని డా. జ్యోతికా రాజావత్ షా స్పష్టం చేశారు.