అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bank Customers : ఇప్పటివరకు ఏ బ్యాంకులోనైనా Bank మినిమం బ్యాలెన్స్ ఉండాల్సిందే. లేదంటే పెనాల్టీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకు ద్వారా పెద్ద ఉపశమనం లభించబోతోంది.
ఇప్పుడు మీకు బ్యాంకులో కనీస బ్యాలెన్స్ లేకపోయినా మీరు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదట. పొదుపు ఖాతాలో కనీస బ్యాలెన్స్‌ను నిర్వహించాలనే నియమాన్ని నెరవేర్చాల్సిన అవసరం లేదని కెనరా బ్యాంక్ ప్రకటించింది. ఈ కొత్త నిబంధన జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నిర్ణయంతో, కెనరా బ్యాంక్‌లో ఎలాంటి పొదుపు ఖాతా కలిగిన వారైనా ఇకపై మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించనందుకు ఎటువంటి ఛార్జీలు లేదా జరిమానాలు చెల్లించాల్సిన అవసరం లేదు.
Bank Customers : గుడ్ న్యూస్..
అన్ని కేటగిరీల సేవింగ్స్ ఖాతాల(savings accounts)కు ఈ కొత్త రూల్ వర్తిస్తుందని బ్యాంకు స్పష్టం చేసింది. పొదుపు ఖాతాలు, ఎన్నారై పొదుపు ఖాతాలు, సాలరీ అకౌంట్స్‌లలో మినిమమ్ బ్యాలెన్స్ Minimum Balance నిర్వహించనందుకు బ్యాంకు కస్టమర్లకు ఇకపై ఛార్జీ విధించదని కెనరా బ్యాంక్(Canara Bank) తెలిపింది. జూన్ 1, 2025 నుండి ఇది అమలులోకి వచ్చిందని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో ఒక నెలలో ఖాతాలో నిర్దిష్ట కనీస బ్యాలెన్స్ నిర్వహించనందుకు బ్యాంక్ ఛార్జీ విధించేది.బ్యాంకు ఈ చొరవ తర్వాత ప్రజలకు ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే చాలా మంది కనీస బ్యాలెన్స్ షరతుల(minimum balance conditions)ను నెరవేర్చలేకపోతున్నారు. దీని కారణంగా వారు ప్రతి నెలా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ మార్పుతో, దేశంలోని ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకు(major public sector banks)ల్లో కనీస నిల్వ అవసరాన్ని పూర్తిగా తొలగించిన మొదటి బ్యాంకుగా కెనరా బ్యాంక్ నిలిచింది. అంటే, ఖాతాదారులు తమ సేవింగ్స్ ఖాతాలలో ఎటువంటి రుసుములు లేకుండా జీరో బ్యాలెన్స్‌ను కూడా కొనసాగించవచ్చు. గతంలో, కెనరా బ్యాంక్ Canara BAnk పట్టణ ప్రాంతాల్లోని కస్టమర్లు రూ. 2,000, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ. 1,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 500 కనీస నిల్వను నిర్వహించాలని నిబంధన ఉండేది. ఈ పరిమితులను పాటించడంలో విఫలమైతే పెనాల్టీలు విధించేవారు. ఈ తాజా మార్పు విద్యార్థులు(students), మహిళలు(women), సీనియర్ సిటిజన్లు(senior citizens), అల్ప ఆదాయ వర్గాలకు చెందిన వారితో సహా విస్తృత శ్రేణి వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చనుంది.