అక్షరటుడే, వెబ్డెస్క్ : Canada School Shooting | కెనడాలోని ఓ స్కూల్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 9 మంది విద్యార్థులు మృతి చెందారు. మరో 20మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
బ్రిటిష్ కొలంబియా (British Columbia)లోని టంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్లో కెనడా కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో కాల్పులకు పాల్పడిన వ్యక్తి సైతం మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలోని ఉన్నత పాఠశాల లోపల ఆరుగురు వ్యక్తులు చనిపోగా, ఒక నివాసంలో మరో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ (Canadian PM Mark Carney) ఈ ఘటనపై సంతాపాన్ని తెలిపారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఒక్కరే కాల్పులు జరిపారా.. లేక అనేక మంది పాల్గొన్నారా అనే వివరాలు తెలియరాలేదు. కాల్పులు జరపడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాల్పుల ఘటనలో మొత్తం 10 మంది చనిపోయారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనుమానితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి తనకు తానుగా కాల్చుకొని చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడితో సహా మరో ఆరుగురు వ్యక్తులు పాఠశాల లోపల చనిపోయారు. మరో ప్రాంతంలో ఇద్దరు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు.