అక్షరటుడే, ఇందూరు:Care Degree College | జిల్లా కేంద్రంలోని కేర్ డిగ్రీ కళాశాల(Care Degree College nizamabad)లో ఈనెల 10న ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తున్నట్లు కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్(care College Director Narala Sudhakar) తెలిపారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్(HDFC Bank)లో శాశ్వత ప్రతిపాదికన పోస్టులను భర్తీ చేసేందుకు కంపెనీ ప్రతినిధులు ఈ నియామకాలు చేపట్టారని పేర్కొన్నారు. డిగ్రీ/బీటెక్ లో 50 శాతం మార్కులు ఉండి, 1994 – 2004 మధ్య జన్మించిన వారు అర్హులన్నారు. ఇతర వివరాలకు 9885050761 నంబరులో సంప్రదించాలన్నారు.
