Homeజిల్లాలునిజామాబాద్​Navipet | గ్యాస్​ కట్టర్లతో వచ్చి.. షెట్టర్​కు రంధ్రం చేసి.. నగల దుకాణంలో చోరీ

Navipet | గ్యాస్​ కట్టర్లతో వచ్చి.. షెట్టర్​కు రంధ్రం చేసి.. నగల దుకాణంలో చోరీ

నవీపేట్​ మండలంలో దొంగలు రెచ్చిపోయారు..మండల కేంద్రంలోని మెయిన్​రోడ్డుపై ఉన్న బంగారు దుకాణం షెట్టర్​కు రంధ్రం చేసి చోరీకి పాల్పడ్డారు.

- Advertisement -

అక్షరటుడే, బోధన్ ​: Navipet | బోధన్​ (Bodhan) నియోజకవర్గంలో దోంగలు రెచ్చిపోయారు. నవీపేట్​ మండల కేంద్రంలో ఓ నగల దుకాణంలో చోరీకి పాల్పడ్డారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి మండల కేంద్రంలోని మెయిన్​రోడ్​లో ఉన్న ఓ సిల్వర్​ మర్చంట్​ దుకాణానికి దుండగులు గ్యాస్​ కట్టర్ (Gas Cutter)​తో షట్టర్​కు రంధ్రం చేశారు. అనంతరం దుకాణంలోకి చొరబడ్డారు. అయితే బంగారం ఉన్న లాకర్​ను పగులగొట్టే ప్రయత్నం చేసే సమయంలో రోడ్డుపై అలికిడి వినబడడంతో వెంటనే వెండివస్తువులను ఎత్తుకుని పారిపోయినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఎస్సై తిరుపతి (SI Tirupati) మాట్లాడుతూ.. దుకాణాదారుల నుంచి ఫిర్యాదు అందలేదని.. అనంతరం దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.

Must Read
Related News