అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం కోసం డయల్ 100 నంబరును (Dial 100 number) ఉంటుంది. అయితే కొందరు ఆకతాయిల తీరుతో ఏది నిజమైన కాల్.. ఏది ఫేక్ కాల్ అనేది పోలీసులు గుర్తించలేకపోతున్నారు. ఇటీవల డయల్ 100కు అనవసర కాల్స్ పెరిగిపోతున్నాయి. దీంతో పోలీసులు కఠిన చర్యలకు పునుకుంటున్నారు.
తాజాగా మద్యం మత్తులో పదేపదే 100 నంబరుకు కాల్ చేసిన వ్యక్తికి కోర్టు ఒకరోజు జైలుశిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించింది. కామారెడ్డి పట్టణ సీఐ నరహరి (Kamareddy town CI Narahari) తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి పట్టణానికి చెందిన షేక్ అమీర్ అనే వ్యక్తి మద్యం మత్తులో అనవసరంగా సోమవారం డయల్ 100కు పదేపదే కాల్ చేశాడు. ఐదు సార్లు కాల్ చేసి పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడు. దీంతో పోలీసులు అతడిని పట్టుకుని మంగళవారం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ (Second Class Magistrate Chandrashekhar) ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ అతనికి రూ.వెయ్యి జరిమానాతో పాటు ఒక రోజు జైలు శిక్ష విధించారు.
ఈ సందర్భంగా సీఐ నరహరి మాట్లాడుతూ.. అత్యవసర సమయంలో మాత్రమే డయల్ 100ను ఉపయోగించాలన్నారు. అనవసరంగా కాల్ చేసి పోలీసుల విలువైన సమయాన్ని వృథా చేయకూడదని కోరారు.
