Homeజిల్లాలుహైదరాబాద్Hydraa | చెరువులు, నాలాలు కబ్జాకు గురైతే ఫోన్​ చేయండి : హైడ్రా

Hydraa | చెరువులు, నాలాలు కబ్జాకు గురైతే ఫోన్​ చేయండి : హైడ్రా

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | నగరంలో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో మొదటి విడతగా నగరంలోని 6 చెరువులను పునరుద్ధరిస్తోంది. నగరానికి వరద ముప్పు తప్పించాలంటే గొలుసుకట్టు చెరువులు కీలక పాత్ర పోషిస్తాయని హైడ్రా (Hydraa) పేర్కొంది.

వర్షం (Rain) పడితే వరద నీరు రహదారులు, నివాస ప్రాంతాలను ముంచెత్తకుండా.. నేరుగా చెరువుల్లోకి చేరేలా హైడ్రా చర్యలు తీసుకుంటోంది. చెరువులు, నాలాలను పరిరక్షించడం ఎంతో అవసరమని హైడ్రా సూచిస్తోంది. నాలాలు, చెరువుల రక్షణకు ప్రజలు సహకరించాలని కోరుతోంది. నగరంలో ఎక్కడైనా చెరువులు, నాలాలు కబ్జాకు గురవుతుంటే ఆ సమాచారాన్ని హైడ్రా వాట్సాప్ నంబరు (Hydraa Whatsapp Number) 8712406899 కు పంపాలని విజ్ఞప్తి చేస్తోంది. ఫొటోలతో పాటు.. ప్రాంతాలను తెలియజేసే లొకేషన్​ షేర్ చేస్తే తాము చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కమిషనర్ హైడ్రా(Commissioner Hydraa) పేరిట ఉండే ట్విట్టర్(ఎక్స్), ఇన్​స్టాగ్రామ్, ఫేస్ బుక్​లో కూడా సమాచారం అందజేయొచ్చని అధికారులు వివరించారు. అలాగే 7207923085 నంబరు ద్వారా నేరుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్​కు ఆక్రమణపై ఫిర్యాదు చేయొచ్చని ఒక ప్రకటనలో తెలిపారు.