HomeతెలంగాణHyderabad | పెద్దమ్మగుడిలో పూజలకు పిలుపు.. బీజేపీ నేతలను అరెస్ట్​ చేసిన పోలీసులు

Hyderabad | పెద్దమ్మగుడిలో పూజలకు పిలుపు.. బీజేపీ నేతలను అరెస్ట్​ చేసిన పోలీసులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలోని బంజారాహిల్స్ (Banjara Hills)​ ఎన్​బీటీ నగర్​లో గల పెద్దమ్మ గుడి (Peddamma Temple)ని ఇటీవల కూల్చివేసిన విషయం తెలిసిందే. దీనిపై హిందు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఆలయంలో కుంకుమార్చనకు హిందూ సంఘాల పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు పలువురు బీజేపీ (BJP), హిందూ సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్ట్​ చేశారు.

Hyderabad | భారీ బందోబస్తు

హిందూ సంఘాల పిలుపు నేపథ్యంలో పెద్దమ్మ గుడి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పెద్దమ్మగుడిలో కూల్చివేతలపై భక్తులు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో పోలీసులు బంజారాహిల్స్‌కు వెళ్లే అన్ని మార్గాలు మూసివేశారు. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలను హౌస్​ అరెస్ట్ చేశారు.

Hyderabad | రాంచందర్​ రావు హౌస్​ అరెస్ట్​

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు (Ramchandar Rao)ను పోలీసులు హౌస్​ అరెస్ట్​ చేశారు. పెద్దమ్మ ఆలయంలో పూజలకు ఆయన వచ్చే అవకాశం ఉందని అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం దుండగుడు గుడిని ధ్వంసం చేయడంతో వివాదం నెలకొంది. రాంచందర్​రావును హౌస్​ అరెస్ట్ చేయడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్​ (Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దమ్మ గుడిలో పూజలు చేస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ఆలయాన్ని కూల్చిన వారిని ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పాలనకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కాగా ఇటీవల ఆయన మాట్లాడుతూ.. బంజరాహిల్స్​ ఉప ఎన్నికల్లో ఓ వర్గం ఓట్ల కోసమే ప్రభుత్వం గుడిని కూల్చిన వారిపై చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు.

Must Read
Related News