అక్షరటుడే, బోధన్: Bodhan | ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు మంగళవారం బోధన్ బంద్కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ కష్టకాలంలో వెన్నంటి ఉండి సేవలందించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి (MLA Sudarshan Reddy) కాంగ్రెస్ అధిష్టానం అన్యాయం చేసిందన్నారు. దీనికి నిరసనగా బంద్కు పిలుపునిచ్చినట్లు వారు పేర్కొన్నారు. మొదటి కేబినెట్ విస్తరణలో అవకాశం ఇవ్వనప్పటికీ సీనియర్ ఎమ్మెల్యే అయిన సుదర్శన్ రెడ్డికి రెండోసారి అవకాశం వస్తుందని ఊహించామని వారు వివరించారు.
